WPL-2026 మెగా వేలంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్‌ను ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. గత మూడు సీజన్లలోనూ ఆమె ముంబైకే ఆడింది. భారత పేసర్ రేణుకా సింగ్‌ను రూ.60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హీలీ బేస్ ధర రూ.50 లక్షలు కాగా ఆమెను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు.