భూపాలపల్లి జిల్లా SP కార్యాలయంలో ఇటీవల నూతన SPగా బాధ్యతలు చేపట్టిన సంకీర్తనను గురువారం BHPL ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఏరియా స్థితిగతులు, భద్రతా అంశాల పై వివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ కార్తీక్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, తదితరులు ఉన్నారు.