ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) జనవరి 9న ప్రారంభంకానుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. నవీ ముంబై, వడోదరలో ఈ మ్యాచ్లు జరగనున్నాయని వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.