భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులుగా నియమితులై తోట దేవి లక్ష్మీప్రసన్న పినపాక మండల ప్రజాభవన్‌కు గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాండ్ల సురేష్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో దేవి ప్రసన్నాను సన్మానించారు. అలాగే శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు.