TG: మహబూబాబాద్ జిల్లా మహబూబపట్నం పంచాయతీ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అక్కడ కల్పించిన రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లపై విచారించిన కోర్టు.. ఒకే వార్డులో ఆరుగురు ఎస్టీలు ఉంటే.. మిగితా రెండు వార్డులతో పాటు సర్పంచ్ పదవికి ఎస్టీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.