MDK: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ పేర్కొన్నారు. మెదక్ ఐడీవోసీ కార్యాలయానికి విచ్చేసిన భారతి లక్పతి నాయక్, వ్యయ పరిశీలకులు బలరాంలకు అదనపు కలెక్టర్ నాగేష్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.