W.G: జిల్లాలో బాల్య వివాహాల నివారణకు సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని ఐసీడీఎస్ సీడీపీవో టి.ఎల్. సరస్వతి అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామస్థాయి సీఎంపీవోస్ శిక్షణా కార్యక్రమం జరిగింది. బాల్య వివాహాల నివారణ కమిటీ సభ్యులు ప్రతి నెల మొదటి, మూడవ శుక్రవారం తప్పనిసరిగా సమావేశం కావాలని ఆమె ఆదేశించారు.