తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీనికి డిత్వా తుఫానుగా వాతావరణ శాఖ అధికారులు పేరు పెట్టారు. రేపు, ఎల్లుండి ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపారు. దీని కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.