TG: హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌ను హైకోర్టు హెచ్చరించింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. HYD అంబర్ పేటలోని బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. కాగా, గతంలోనూ హైడ్రా తమ ఆదేశాలను పాటించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.