MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. రేగోడు, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్ మండల పరిషత్ కార్యాలయాలలో నామినేషన్ ప్రక్రియ పరిశీలించారు. ఆరు మండలాల్లోని 160 సర్పంచు, 142 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించారు.