PPM: పీఎం ఆవాస్ యోజన(గ్రామీణం) 2.0 పథకం కింద అర్హులైన లబ్దిదారులు ఇళ్లకోసం గ్రామ పంచాయతీలోని సర్వే బృందంతో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ డా. ఎన్ ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈనెల 10 నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎంపీడీవో హౌసింగ్ ఏఈల ఆధ్వర్యంలో సర్వే చేపట్టనున్నామన్నారు. పార్వతీపురం, పాలకొండ, సాలూరు మున్సిపాల్టీల మినహా అన్ని పంచాయతీలో సర్వే అవుతుంది.