SKLM డా.బీ.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీ క్రీడాకారిణి గుజ్జల వర్షిత రాజస్థాన్ వేదికగా జరుగుతున్న ఖేల్ ఇండియా పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఈ పోటీల్లో మహిళల 69 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం నుంచి పాల్గొన్న వర్షిత విజయం పై వీసీ రజని, రిజిస్ట్రార్ బి. అడ్డయ్య ఆమెకు గురువారం అభినందనలు తెలిపారు.