KRNL: హైదరాబాద్ పోలీసులు బుధవారం నందికొట్కూరు వాసి శశికాంత్‌ను అరెస్ట్ చేశారు. తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ, కర్నూలులో ఓ మహిళ ల్యాబ్ తెరిపిస్తానని రూ. 13 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. సైరన్ కార్లు, వాకీ-టాకీలు, బాడీగార్డులతో అధికారిక వాతావరణం సృష్టించి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.