PPM: వీరఘట్టం నుంచి ఇతర ప్రాంతాలకు కర్రలను తరలిస్తున్న ఓ లారీని సీజ్ చేసినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి రమణమూర్తి తెలిపారు. గురువారం రాత్రి ఎం.రాజపురం జంక్షన్ సమీపంలో లారీకు కర్రలను లోడ్ చేస్తున్న విషయాన్ని గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరికి ఇలా లారీలో తరలిస్తుండడంతో వెంటనే లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు.