మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఎస్సై బాబు గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో నియమావళిని కచ్చితంగా పాటించాలని, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. సోషల్ మీడియా పోస్టులతో వివాదాలు రేకెత్తించవద్దని, సభలు, డీజేలకు అనుమతులు లేవని తెలిపారు. నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.