BHPL: మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో చెత్త పేరుకుపోయి కంపు కొడుతోంది. ఇటీవల విధుల్లో మృతి చెందిన కార్మికుడు బొల్లిరాజయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడంతో ఈ దుస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించి..పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించాలని కోరారు.