BHPL: శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో పోలీస్ యాక్ట్-1861 నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని జిల్లా SP సిరిశెట్టి సంకీర్తన హెచ్చరించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో SP మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ధర్నా, రాస్తారోకో, ర్యాలీ, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, చట్టవ్యతిరేక చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.