ELR: గుండాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. టీ.నర్సాపురం మండలం తెడ్ల గ్రామంలో గుండాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై జయ బాబు గురువారం రాత్రి వారిపై దాడి చేశారు. అక్కడ గుండాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 3,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు గుండాట బోర్డు కూడా స్వాధీనం చేసుకున్నారు.