పశ్చిమబెంగాల్లో ప్రస్తుత ఓటరు జాబితాలో 26 లక్షల మంది ఓటర్ల పేర్లు 2002 నాటి ఓటరు జాబితాలో సరిపోలడం లేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటరు జాబితా SIRను బెంగాల్లోని సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న వేళ ఈసీ ప్రకటన చేయడం గమనార్హం. SIRలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 6 కోట్లకుపైగా ఎన్యుమరేషన్ దరఖాస్తులను డిజిటైజ్ చేసినట్లు పేర్కొంది.