SKLM: పాతపట్నం శ్రీ నీలకంటేశ్వర స్వామి మార్గశిర అష్టమి ఇవాళ ప్రత్యేక పూజలు అందుకున్నారు. తెల్లవారుజాము నుంచి అనేక ప్రాంతాల భక్తులు స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి ప్రత్యేక పువ్వులతో అలంకరణ చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు.