HYD: జేఎన్టీయూ HYDలో ఈఈఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు(3YR) చదువుతున్న విద్యార్థిని దివ్య ఆత్మహత్య క్యాంపస్లో కలకలం రేపింది. హాజరు సమస్యల కారణంగా దివ్య తీవ్రమైన ఒత్తిడికి గురై ఉండవచ్చని తోటి విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు.