ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉడిపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠానికి వచ్చిన ఆయన లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానితో పాటు లక్ష మంది భక్తులు, గాయకులు ఏకకాలంలో భగవద్గీత శ్లోకాలను పఠించారు. అనంతరం మధ్వసరోవరంలో తీర్థ ప్రోక్షణ తర్వాత ఆలయంలో కనకన కిండి నుంచి శ్రీకృష్ణుడిని మోదీ దర్శించుకోనున్నారు.