కృష్ణా: బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం అని, నేరమని వీటి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఉయ్యూరు రూరల్ ఎస్సై బాబు కోరారు. బాల్యవివాహాల పట్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరులోని ఆకునూరు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి ఇవాళ వివరించారు. బాల్యవివాహాలు నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.