మహబూబాబాద్ మండలం ముడుపుగల్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జేర్రిపోతుల ఉపేందర్, కార్యదర్శి కొత్త హేమంత్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరికీ సమాన ఓట్లు రావడంతో గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు బొమ్మ.. బోరుసు ద్వారా అభ్యర్థిని ఎంపిక చేశారు. చివరకు హేమంత్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.