కృష్ణా: పెనమలూరు మండలం చోడవరం గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘రైతన్నా నీకోసం’ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులు, రైతులతో ముఖాముఖీ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఎమ్మెల్యే తెలిపారు.