SDPT: ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి సూచించారు. ములుగు మండలం వంటిమామిడి శివారులోని రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ శిబిరాన్ని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. రిజిస్టర్ వెరిఫై చేశారు. ఇప్పటివరకు 96 వాహనాల తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం చిన్నతిమ్మాపూర్లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు.