BHPL: జిల్లా కేంద్రంలోని ఓసీ-2 గేట్ వద్ద పకీర్గడ్డ, ఆకుదారివాడ భూనిర్వాసితులు ఇవాళ నిర్వహించిన ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ .. గత 18 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్ఎంఆర్ ప్యాకేజీ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.