BPT: పిట్టలవానిపాలెం మండలం ఇంటూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందోలు – తెనాలి ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.