VZM: తాగునీరు వృథా చేయవద్దని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం జగన్నాథపురంలో శుక్రవారం తాగునీటి సరఫరాను పరిశీలించారు. తాగునీటిని పొదుపుగా వాడాలని ప్రజలను కోరారు. క్లోరినేషన్ చేసిన తర్వాత తాగునీరు సరఫరా చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.