కర్ణాటక పాలిటిక్స్ హీటెక్కాయి. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య గొడవ ఇలాగే సాగితే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని మాజీ సీఎం బసవరాజు బొమ్మై హెచ్చరించారు. ఆ ఇద్దరి ఈగోలు తగ్గట్లేదని, అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వేరే ఆప్షన్ వెతుకుతోందని బాంబ్ పేల్చారు. త్వరలోనే ఓ కొత్త వ్యక్తి (డార్క్ హార్స్) సీఎం సీటు కోసం తెరపైకి రావొచ్చని జోస్యం చెప్పారు.