W.G: ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజుకు రివార్డు లభించింది. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠా సభ్యులను ఇటీవల అరెస్టు చేసిన పోలీసు బృందంలో ఈయన పని చేశారు. అలాగే గత ఏడాది యండగండిలో జరిగిన బాక్స్ మర్డర్ కేసు దర్యాప్తులో ఎస్సై చురుకైన పాత్ర వహించారు. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి రివార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు.