భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. అమెరికా విధించిన సుంకాలు కూడా భారత వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం జీడీపీ వృద్ధిరేటు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో(2024-25) ఇదే త్రైమాసికంలో 5.6 శాతం జీడీపీ వృద్ధిరేటు నమోదైంది.