PPM: జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 11న జరగబోయే మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి హాజరుకావాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రని అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించారు. శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి కరపత్రాలు అందించారు.