VZM: సచివాలయం ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేయాలని గజపతినగరం ఎంపీడీవో కళ్యాణి అన్నారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని గంగ చోళ్ళపెంట గ్రామ సచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జి. జనార్ధనరావు పాల్గొన్నారు.