రక్షణ రంగంలో అమెరికా, భారత్ మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. భారత నౌకాదళంలో ఉన్న MH60R హెలికాప్టర్ల నిర్వహణకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికా ప్రభుత్వంతో ఐదేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 7,995 కోట్లు. న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.