ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్లను శాసించే స్థాయికి భారత్ ఎదగబోతోంది. రానున్న 10 ఏళ్లలో భారత్ ఈ ఘనత సాధిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం దేశీయంగా బంగారు గనుల తవ్వకాలను భారీగా పెంచబోతున్నామని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత సీఈవో సచిన్ జైన్ తెలిపారు. ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడుతున్న మనం.. సొంతంగా మైనింగ్ పెంచితే.. బంగారం ధరల రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది.