TG: సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం సభలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో, డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో, డిసెంబర్ 4న ఆదిలాబాద్‌లో, డిసెంబర్ 5న నర్సంపేటలో, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో సభ జరగనుంది.