SKLM: సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన అవసరమని శ్రీకాకుళం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ వైవీ శివకుమార్ అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిందని అన్నారు. పారదర్శకంగా సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఈ చట్టం కల్పించిందని తెలిపారు.