కడప బాలోత్సవం-3.0 సన్నాహకాల్లో భాగంగా ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి 150 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. శుక్రవారం కళాశాలలో సాంస్కృతిక, విద్యా, వసతుల నిర్వహణ సేవలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం అధ్యక్షుడు గోపాల్, ఇన్ఛార్జ్ మహేశ్ బాబు పాల్గొన్నారు.