NRPT: మరికల్ మండలం మాధవరంలో రైతు లక్ష్మయ్యకు చెందిన వరిగడ్డి వాము శుక్రవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదంపై విచారణ చేస్తున్నట్లు స్థానిక ఎస్సై రాము తెలిపారు.