KRNL: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ కర్నూలు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ ప్రకటించారు. ఈ పొడిగింపు డిసెంబర్ 1, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు లేదా కొత్త కార్డుల జారీ జరిగే వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నవంబర్ 30 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు.