TG: కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి ప్రాంతంలోని ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ విషయం చెబితే.. బీఆర్ఎస్ వాళ్లు తన మీద నోరు వేసుకొని పడిపోతారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ 21, 22 ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు వచ్చాయి తప్పితే.. ప్రజలకు మేలు మాత్రం శూన్యమేనన్నారు. తనపై కుట్ర చేసి.. కుటుంబం నుంచి దూరం చేశారని బాధపడ్డారు.