NDL: ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్లో సెక్యూరిటీ అనలిస్ట్ కోర్సుకు ఉచిత శిక్షణను శనివారం నుంచి ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. APSSDC ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కోర్సుకు డిగ్రీ, బీటెక్ విద్యార్హత ఉన్నవారు అర్హులన్నారు. 3 నెలల ఉచిత శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆసక్తి గల వారు కళాశాలను సంప్రదించాలన్నారు.