AKP: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించారు. పోలీస్ సిబ్బంది వ్యక్తిగత వృత్తి సంబంధమైన సమస్యలను తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.