E.G: గోపాలపురం మండలం చెరుకుమిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు (NTR) విగ్రహాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు NTR చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ గొప్పతనం, కీర్తి ప్రతిష్టల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు, NTR అభిమానులు పాల్గొన్నారు.