ASR: జిల్లాలో గ్రామ సచివాలయాల పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 22 మండలాలకు 22 మంది అధికారులను నియమించారు. వీరు డిశంబర్ 1 నుంచి విధుల్లోకి రానున్నారు. సచివాలయాలను పర్యవేక్షణ చేయనున్నారు. పాడేరు మండలానికి రామకృష్ణ, అరకు ప్రసాద్, చింతపల్లి మూర్తి, రంపచోడవరం గిరిబాబు తదితరులు నియమితులయ్యారు.