HYD: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఫిలింనగర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఫూలే మహిళా విద్య, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంస్కర్త అని ఎమ్మెల్యే స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ఛైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ సహా పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.