మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా కోసం చిరంజీవి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన రూ.70 కోట్లు నుంచి రూ.75 కోట్ల మేరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరు కెరీర్లోనే ఇది అత్యధికమని సినీ వర్గాలు తెలిపాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.