కోచ్ గంభీర్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందిస్తూ… ఓటమికి కేవలం కోచ్‌ను మాత్రమే నిందించడం సరికాదని చెప్పాడు. జట్టులోని ఒక్క ఆటగాడు కూడా బాధ్యతగా ఆడలేదని అన్నాడు. జట్టులోని అందరికీ జవాబుదారీతనం ఉండాలని తెలిపాడు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, దాన్ని సరిదిద్దుకోవాలని సూచించాడు.