JNG: బచ్చన్నపేట మండలానికి చెందిన సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ నాయకుడు కొయ్యడి శ్రీనివాస్ సొంత గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తనకు కన్నతల్లి లాంటిదని, స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.